'శాంటా ఫే'ను భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయనున్న హ్యుందాయ్

Hyundai Santa Fe
దేశపు రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'శాంటా ఫే'ను ఇకపై భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలని ఈ కొరియన్ కంపెనీ భావిస్తోంది. ఇప్పటి వరకూ ఈ కారును పూర్తిగా దక్షిణకొరియాలోని హ్యుందాయ్ ఉత్పత్తి కేంద్రంలో తయారుచేసి భారత్‌కు దిగుమతి చేసుకుని ఇక్కడి మార్కెట్లో కంపెనీ విక్రయిస్తూ వచ్చింది. అయితే ఇటీవల బడ్జెట్ సవరణల కారణంగా పెరిగిన దిగుమతి సుంకాన్ని దృష్టిలో ఉంచుకొని, శాంటా ఫే ఎస్‌యూవీ విడిభాగాలను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) రూపంలో దిగుమతి చేసుకొని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలని హ్యుందాయ్ నిర్ణయించింది.

మరోవైపు ఇలా సిబియూ యూనిట్‌గా దిగుమతి చేసుకోవడం వల్ల, భారత మార్కెట్లో దీని ధర కూడా అధికంగా ఉండటంతో దీనికి మార్కెట్ ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. శాంటా ఫే విక్రయాలకు కూడా కంపెనీ అంచనాలను తాకలేకపోయాయి. ఇప్పటికే పలు దేశీయ ,విదేశీయ పోటీదారులు తక్కువ ధరలకే ఎస్‌యూవీలను అందిస్తుండటంతో మార్కెట్లో పోటీని ఎదుర్కొని హ్యుందాయ్ నిలబడాలంటే శాంటా ఫే కారు ధరను తగ్గించక తప్పదు. ఈ నేపథ్యంలో శాంటా ఫే ఎస్‌యూవీని ఇక్కడే అసెంబ్లిగ్ చేసినట్లయితే ఉత్పాదక వ్యయం తగ్గడమే కాకుండా పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. అంతేకాదు.. హ్యుందాయ్ వేసే ఈ అడుగు వల్ల ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉన్న టొయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లు కూడా అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 26, 2011, 13:06 [IST]
English summary
The Hyundai Santa Fe was one model that Hyundai Motors India was hoping to conquer the SUV scene. Hyundai has now decided to assemble the Santa Fe in India in a CKD (Completely knocked down) form. This move will not only reduce the price of the car due to reduced taxes, Hyundai will be able to provide a viable competitor to the current market leader – Toyota Fortuner.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+