హ్యుందాయ్ కార్లపై డిసెంబర్ డిలైట్ డిస్కౌంట్స్!!

Hyundai Discounts
తగ్గింపు ధరలలో లేదా తక్కువ ధరలలో కార్లను కొనాలనుకునే వారికి డిసెంబర్ మాసం ఎంతో అనువైనది. అందులోనూ పెట్రోల్ కార్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ఎందుకంటే, స్టాక్ క్లియరెన్స్ సేల్ పేరుతో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు వివిధ మోడళ్లపై నగదు తగ్గింపులను, ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న వివిధ మోడళ్లపై కంపెనీ డీలర్లు భారీ తగ్గింపుల, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. హ్యుందాయ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఇయాన్ కారును మొదలుకొని సరికొత్త ఫ్లూయిడ్ వెర్నా మోడల్ వరకూ దాదాపు అన్ని మోడళ్లపై ఆఫర్లు లభిస్తున్నాయి.

హ్యుందాయ్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

- హ్యుందాయ్ ఇయాన్ కారుపై రూ.10,000 ఎక్సేంజ్/లాయల్టీ బోనస్‌ను, ప్రతి టెస్ట్ డ్రైవ్‌పై ఓ ఉచిత బహుమతిని అందిస్తుంది. హ్యుందాయ్ ఇయాన్ ప్రారంభ ధర రూ.2.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.- హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారు శాంత్రోపై సుమారు 40,000 రూపాయల విలువైన సేవింగ్స్ (రూ.11,988 విలువైన ఇన్సూరెన్స్, రూ.7,500 విలువైన గిఫ్ట్ చెక్, రూ.20,000 ఎక్సేంజ్/లాయల్టీ బోనస్‌)ను అందిస్తుంది.
- హ్యుందాయ్ నుంచి లభిస్తున్న మరో చిన్న కారు ఐ10 హ్యాచ్‌బ్యాక్‌పై సుమారు రూ.50,000 విలువైన సేవింగ్స్ (రూ.15,151 విలువైన ఇన్సూరెన్స్, రూ.15,000 విలువైన గిఫ్ట్ చెక్, రూ.20,000 ఎక్సేంజ్/లాయల్టీ బోనస్‌)లను ఆఫర్ చేస్తుంది.
- హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఐ20పై (పెట్రోల్ వేరియంట్ మాత్రమే) సుమారు రూ.42,000 విలువైన సేవింగ్స్ (రూ.16,866 విలువైన ఇన్సూరెన్స్, రూ.5,000 విలువైన గిఫ్ట్ చెక్, రూ.20,000 ఎక్సేంజ్/లాయల్టీ బోనస్‌)లను అందిస్తుంది.
- అలాగే హ్యుందాయ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'వెర్నా ఫ్లూయిడిక్' (పెట్రోల్ వేరియంట్)పై రూ.15,000 విలువైన డిస్కౌంట్ లభిస్తుండగా, డీజిల్ వేరియంట్ వెర్నాపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్ లేదు.
- హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్‌పై రూ.30,000 డిస్కౌంట్.
- హ్యుందాయ్ ప్రీమియం సెడాన్ సొనాటాపై రూ.82,000 డిస్కౌంట్.

ఈ ఆఫర్లు డిసెంబర్ 27 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. మరింకెందుకు ఆలస్యం పాత సంవత్సరం వెళ్లిపోకమునుపే మీ లక్కీ కారును బుక్ చేసుకొని కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ఆస్వాదించండి.

More from DriveSpark

Article Published On: Friday, December 9, 2011, 11:42 [IST]
English summary
India's second largest carmaker Hyundai Motor India is offering huge discounts on their car as a stock clearance sale. Here is list of offers from Hyundai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+