ఢిల్లీ మెట్రో స్టేషన్లలో దర్శనమిస్తున్న హ్యుందా ఇయాన్

సామాన్యుల నుంచి హైప్రొఫైల్ కలిగిన వ్యక్తుల వరకూ ప్రయాణించే మెట్రో రైల్వే స్టేషన్లను హ్యుందాయ్ లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ మెట్రో స్టేషన్లలో హ్యుందాయ్ తమ చిన్న కారు ఇయాన్‌ను ప్రదర్శనకు ఉంచింది. అంతేకాకుండా.. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇయాన్ కారును ప్రదర్శనకు ఉంచింది.
ఈ వినూత్న ప్రచార కార్యక్రమ కాన్సెప్ట్‌ను రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్‌కు చెందిన బిగ్ స్ట్రీట్ రూపొందించింది. ఈ క్యాంపైన్ 21 రోజుల పాటు జరగనుంది. ఈ క్యాంపైన్‌లో భాగంగా హ్యుందాయ్ తమ ఇయాన్ కారు విశిష్టతల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది. ఇయాన్‌కు భారత మార్కెట్లో కొనుగోలుదారుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








