హైదరాబాద్‌లో ఇయాన్‌ను విడుదల చేసిన హ్యుందాయ్

Hyundai Eon
హైదరాబాద్: కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన చిన్నకారు ఇయాన్ ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా లభ్యం కానుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ చిన్న కారు ఇయాన్‌ను శుక్రవారం లాంఛనంగా రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో హ్యుందాయ్ ఇయాన్ ధరు రూ.2,74,799 నుంచి రూ.3,78,480 (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్‌) మధ్యన ఉన్నాయి.

హ్యుందాయ్ ఇయాన్ విడుదలైన కొద్ది రోజుల్లోనే 7,500 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని, ప్రతి నెలా 12,000 యూనిట్ల వరకూ ఇయాన్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అరవింద్ సక్సేనా తెలిపారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మలేసియా వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాలకు ఇయాన్‌ను ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

హ్యుందాయ్ ఇయాన్‌ కారులో అమర్చిన 3-సిలిండర్, 815 సీసీ ఇంజన్ 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరుకు 21.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంకా ఇందులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇమ్మొబిలైజర్, వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది ఆరు వేరియంట్లలో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 22, 2011, 8:54 [IST]
English summary
The Hyundai Eon has finally been launched. The new small car from Hyundai is available in six variants with the entry level model costing Rs.2,74,799 (ex showroom, Hyderabad). The Eon according to Hyundai is a car that has been conceived and designed and produced exclusively for India.. The top end eon Sports will be priced at Rs.3.71 lakhs. The Eon is powered by 815cc petrol engine that develops 56PS and 76.5 Nm of torque. Hyundai has claimed a fuel economy of 21.1 kmpl which is also impressive. The Alto on the other hand offers a fuel economy of 18kmpl.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+