బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ఇయాన్, చెన్నైలో విడుదల

ఇదిలా ఉండగా.. హ్యుందాయ్ ఇయాన్ కారుకు విడుదలైన ప్రతిచోటా అశేష ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే హ్యుందాయ్ ఇయాన్‌కు 5,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్.డబ్ల్యూ. పార్క్ వెల్లడించారు.
ఏటా 1.5 లక్షల ఇయాన్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రానున్న సంవత్సరంలో దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలకు ఇయాన్‌ను ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా ఏటా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








