క్రికెట్ ప్రపంచ కప్ 2011తో హ్యుందాయ్ మోటార్ ఒప్పందం

Hyundai
కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాలలో దర్శనమివ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) అధికారిక కార్ పార్టనర్‌గా హ్యుందాయ్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మరో నాలుగేళ్ల పాటు హ్యుందాయ్ ఐసీసీతో సహకరించనుంది. అంతేకాకుండా.. మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్‌ 2011కు అధికారిక కార్ భాగస్వామిగా హ్యుందాయ్ వ్యవహరించనుంది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ క్రికెట్ మెగా ఈవెంట్‌లో తాము కూడా భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని, ఇటువంటి గొప్ప కార్యక్రమానికి రవాణా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్విహించే ఈవెంట్ మేనేజర్లకు అత్యత్తుమైన సౌకర్యం, భద్రతలు కలిగిన కార్లను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరో నాలుగేళ్ల పాటు ఐసీసీతో కలిసిపనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ ఒప్పందం ప్రకారం.. క్రికెట్ ప్రపంచ కప్ 2011 కోసం వచ్చే ఆటగాళ్లకు, అధికారులకు, ముఖ్య అథిదులకు హ్యుందాయ్ మోటార్ రవాణా సదుపాయాలను అందిచాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి అవసరమయ్యే ఇతర రవాణా సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిచాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం 2015 వరకూ కొనసాగనుంది. ఈ ఒప్పంద సమయంలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్, టి-20 ఈవెంట్లకు కూడా హ్యుందాయ్ రవాణా సదుపాయలను కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం హ్యుందాయ్ ప్యాసింజర్ కారు 'ఐ10', స్పోర్ట్స్ యుటిలిటి కారు 'శాంటా ఫే', 'వెర్నా ట్రాన్స్‌ఫామ్', 'సొనాటా ట్రాన్స్‌ఫామ్' కార్లను అందుబాటులో ఉంచనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 9, 2011, 16:49 [IST]
English summary
The Korean car maker who has been on close rivalry with the native manufacturer Maruti Suzuki, is getting new posture. The company has secured a status with the alliance from International Cricket Conference as Official Car Partner for another four years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+