జనవరిలో అన్ని ఉత్పత్తుల ధరలు పెంచనున్న హ్యుందాయ్

ఈ కొత్త ధరలు జనవరి 1, 2011 నుండి అమలులోకి రానున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి ఏ మోడల్‌పై ఎంత మేర ధరలు పెంచనున్నది ఖరారు చేయలేదని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ఇంధన ధరలు, రూపాయి మారకపు విలువలో ఒడిదుడుకులు వంటి పలు కారణాల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని ఆయన అన్నారు.
కాగా.. ఇప్పటికే జనవరి నెలలో ధరలు పెంచనున్న కంపెనీ జాబితాలో జనరల్ మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్ కంపెనీలు చేరిన సంగతి తెలిసిందే. త్వరలో మారుతి సుజుకి కూడా ధరల పెంపు విషయంపై ఓ నిర్ణయాన్ని వెల్లడించే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








