అంచనాలకు మించి 'హ్యుందాయ్ వెర్నా' బుకింగ్స్: ఉత్పత్తి పెంపు

గత మే నెలలో విడుదలైన ఈ కొత్త సెడాన్ ధర రూ. 6,99,000 మొదలుకొని రూ. 10,74,500 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంది. ఇది నాలుగు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి, 1.4 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.6 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.4 లీటర్ డీజిల్ కామన్ రైల్ సిఆర్‌డిఐ ఇంజన్, 1.6 లీటర్ డీజిల్ విజిటి సిఆర్‌డిఐ ఇంజన్. 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభించే వెర్నా కారు 4- ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. అలాగే, నాలుగు వేరియంట్లు కూడా మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లతో కూడా లభిస్తాయి.


Click it and Unblock the Notifications








