ఐ10లో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్న హ్యుందాయ్!

ఈ నేపథ్యంలో, భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఐ10లో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. దేశంలో హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఐ10 కూడా ఒకటి.
ప్రస్తుతం హ్యుందాయ్ ఐ10 పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం హ్యుందాయ్ ఐ10 డీజిల్ వేరియంట్‌లో కూడా లభిస్తోంది. ఇందులో 1.1 లీటర్ టర్బోఛార్జ్‌డ్ సిఆర్‌డిఐ ఇంజన్‌ను అమర్చారు. ఇది 75PS @ 4000 rpm శక్తిని మరియు 153 Nm @ 1900-2750 rpm టార్క్‌ను విడుదల చేస్తుంది.
జనరల్ మోటార్స్, టొయోటా వంటి ఆటో దిగ్గజాలు కూడా భారత్‌లో తమ కాంపాక్ట్ కార్లలో డీజిల్ వేరియంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జనరల్ మోటార్స్ గడచిన జులై నెలలో బీట్ డిజిల్ కారును విడుదల చేయగా తాజాగా, టొయోటా ఎతియోస్ డీజిల్ మరియు ఎతియోస్ లివా డీజిల్ వేరియంట్ కార్లను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








