2012 నాటికి చిన్న కారును విడుదల చేయనున్న హ్యుందాయ్

గ్రామీణ మార్కెట్లలో కూడా తమ చిన్న కారును విడుదల చేసి తద్వారా మార్కెట్ వాటాను మరింత విస్తరించుకోవాలని కంపెనీ భావిస్తోంది. హ్యుందాయ్ రూపొందించబోయే చిన్న కారు ఇంజన్ సామర్థ్యం 800 సీసీ నుంచి 1,000 సీసీ మధ్య ఉండవచ్చునని సమాచారం. అంతేకాకుండా దీని ధర కూడా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ. 2 నుంచి రూ. 3 లక్షల మధ్య ఉండవచ్చు. కాగా.. కంపెనీ ఇటవలే భారత మార్కెట్లో సరికొత్త వెర్నా వేరియంట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే వీటి ప్రారంభ ధరలు రూ. 6.99 లక్షలు మరియు 10.75 లక్షలుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








