హ్యుందాయ్ యజమానులకు స్పెషల్ ఆఫర్.. త్వరపడండి

Hyundai
మీరు హ్యుందాయ్ కారు వాడుతున్నారా... అయితే ఈ ఆఫర్‌ ప్రత్యేకంగా మీ కోసమే...! దేశపు రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్).. హ్యుందాయ్ యజమానుల కోసం పది రోజల పాటు "ఉచిత కార్ కేర్ క్లినిక్"ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా వినియోగదారుల కార్లను కంపెనీ ఉచితంగా తనఖీ చేసి ఏదైనా లోపాలు ఉంటే వివరించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 500కు పైగా హ్యుందాయ్ వర్క్‌షాప్ కేంద్రాలలో ఈ సేవలు పదిరోజులపాటు అంటే మార్చి 5, 2011 నుంచి మార్చి 14, 2011 వరకూ అందుబాటులో ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఫ్రీ కార్ కేర్ క్లినిక్‌లో ఇంజన్, ట్రాన్సిమిషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, అండర్-బాడీ, ఏసి, ఎక్స్టీరియ్ మొదలగు వాటిని చెకప్ చేస్తారు. వీటిలో ఏవైనా స్పేర్స్ పాడైనా.. కొత్త వాటిపై 10 శాతం డిస్కౌంట్‌తో కంపెనీ అందిస్తుంది. ఇవే కాకుండా.. లేబర్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్, ఇంకా ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న షెల్ ఆయిల్ కంపెనీ స్క్రాచ్ కార్డ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా షెల్ ఆయిల్, వినియోగ వస్తువులపై 20 శాతం తగ్గింపు, హాంగ్ కాంగ్‌కు ఉచిత హాలిడే ట్రిప్‌లను పొందవచ్చు.

ఈ పది రోజుల పాటు వినియోగదారులకు ఆకర్షనీయమైన కానుకలు, ఎగ్జైటింగ్ ప్రైజులు కంపెనీ అందివ్వనుంది. ఇందులో ఎనిమిది మెగా ప్రైజుల కింద 1.5 టన్ విండో ఏసి, 16 ఇతర అవార్డులు, పొడిగింపబడిన ఉచిత రోజూవారీ వారంటీ, ఇంకా ఓ లక్కీ కస్టమర్‌కు బంపర్ ప్రైజ్‌గా ఓ 40 ఇంచ్‌ల ఎల్‌సిడి టివిని గెలుచుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ హ్యుందాయ్ కారుతో సమీప డీలర్ వద్దకు వెళ్లి మీ కారును ఫ్రీ చెకప్‌ చేయించుకోవడమే. మరింకెందుకు ఆల్యం.. వెంటనే సమీప డీలర్ వద్దకు వెళ్లి మీ ఫ్రీ ఆఫర్‌ను ఉపయోగించుకోండి.. త్వరపడండి..!

More from DriveSpark

Article Published On: Saturday, March 5, 2011, 17:01 [IST]
English summary
Country's second largest car maker, Hyundai Motor India (HMIL), today announced its 10th nationwide Free Car Care Clinic for Hyundai owners. This free service camp in order to extend the advantage of its excellent services and free check-up to a larger number of its customers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+