పెట్రోల్ బాధ మర్చిపోండి.. ఎల్‌పిజి ఐ10 వచ్చేసిందిగా..

పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారా..? అయితే, ఇకపై మీకు ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే.. భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు హ్యుందాయ్ ఐ10లో ఓ ఎల్‌పిజి (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) వేరియంట్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇందులో 34 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉండి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ నుంచి సర్టిఫికేషన్‌ పొందిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎల్‌పిజి కిట్‌ను అమర్చారు. మరి మార్గమధ్యంలో గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా..!? అయినా కంగారుపడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే, ఇందులో 35 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట.

తక్కువ ఖర్చుతో కారును మెయింటైన్ చేయాలనుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎల్‌పిజి వేరియంట్ హ్యుందాయ్ ఐ10 కారుని ప్రవేశపెట్టామని కంపెనీ పేర్కొంది. పూర్తి పెట్రోల్ వేరియంట్ ఐ10తో పోల్చుకుంటే ఎల్‌పిజి వేరియంట్ ఐ10 ధర రూ.27,630 అధికంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదండోయ్.. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోలు వేరియంట్‌ ఐ10 కారును కూడా కావాలనుకుంటే, అదనంగా రూ.27,630 చెల్లించి ఎల్‌పిజికి మార్పించుకోవచ్చునని కంపెనీ వివరించింది.

హ్యుందాయ్ ఐ10 ఎల్‌పిజి రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది.
ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన ఐ10 ఎరా వేరియంట్ ధర రూ.4.16 లక్షలుగా ఉండగా,
టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఐ10 మాగ్నా వేరియంట్ ధర రూ.4.30 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 23, 2011, 11:34 [IST]
English summary
Hyundai Motors has found itself a solution for the ever increasing price of petrol and the demand for diesel cars. It has launched a low priced car with an even cheaper fuel option. The car we are talking about is the Hyundai i10. The i10 will now be available with an LPG option. The new car has been named as the Hyundai i10 LPG Bluedrive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+