ఎగుమతులలో ఐదు లక్షల మార్కును క్రాస్ చేసిన శాంత్రో

కారు డిజైన్, ఇందులో ఉన్న భద్రతా సదుపాయాలు, సాంకేతి పరిజ్ఞానాల కారణంగానే శాంత్రో ఈ రికార్డును సాధించేలా చేసిందని కంపెనీ ఉన్నాతాధికారి ఒకరు వెల్లడించారు. పూర్తిగా భారత్‌లో తయారైన శాంత్రో కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు పైగా ఎగమతి అయినట్లు ఆయన వెల్లడించారు. భారత్‌లోని ప్యాసింజర్ కార్ విభాగంలో 57 శాతం ఎగుమతుల వృద్ధిని సాధించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. హ్యుందాయ్ ఎగుమతి చేసే మోడళ్లలో ఒక్క శాంత్రోనే కాకుండా.. ఆక్సెంట్, ఐ10, ఐ20 కార్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








