జోరు తగ్గని ఇయాన్, కానీ అక్టోబర్ సేల్స్ ఢమాల్..!

ఆక్టోబర్ నెలలో హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు 7.5 శాతం క్షీణించి 48,325 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 52,217 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. సాధారణంగా పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరుగుతాయని, కానీ ఈ సంవత్సరం సెంటిమెంట్ కాస్తంత బలహీనంగా ఉందని హ్యుందాయన్ మోటార్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అరవింద్ సక్సేనా తెలిపారు. పెరిగిన ఇంధన ధరలు, వడ్డీ రేట్ల కారణంగా త్వరలోనే అమ్మకాలు పుంజుకుంటాయనే కంపెనీ అంచనా వేయడం లేదని ఆయన చెప్పారు.
కాగా.. హ్యుందాయ్ ఇయాన్ కారులో అమర్చిన 3-సిలిండర్, 815 సీసీ ఇంజన్ 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరుకు 21.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంకా ఇందులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇమ్మొబిలైజర్, వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది ఆరు వేరియంట్లలో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో హ్యుందాయ్ ఇయాన్ ధరు రూ.2,74,799 నుంచి రూ.3,78,480 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) మధ్యన ఉన్నాయి.


Click it and Unblock the Notifications








