శాంత్రో, ఐ10 కార్లతో సహా ఇతర కార్లపై హ్యుందాయ్ ఆఫర్లు

Discounts on Cars
కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఒక్కొక్కటిగా ఆటోమొబైల్ కంపెనీలన్నీ భారీగా డిస్కౌంట్లు మరియు వివిధ ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. గతంలో జర్మనీకు చెందిన లగ్జరీ కార్‌మేకర్ ఫోక్స్‌వ్యాగన్ తమ కార్లపై కేవలం 5.99 శాతం వడ్డీకే వాహన రుణాలను అందించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఇదే ఆఫర్‌ను తన కాంపాక్ట్ కార్లు అయిన శాంత్రో జింగ్, ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లపై ఆఫర్ చేస్తోంది. ఈ రెండు మోడళ్లపై హ్యుందాయ్ 5.99 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇవి రెండూ హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు.

మూడు లక్షల రూపాయల రుణంపై మాత్రమే కంపెనీ 5.99 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రుణ కాల వ్యవధి 36 నెలల (మూడేళ్లు) పాటు ఉంటుంది. ఇది కాకుండా హ్యుందాయ్ కొత్తగా విడుదల చేసిన వెర్నా ఫ్లూయిడిక్ మినహా మిగిలిన అన్ని పెట్రోల్ మోడల్లపై వివిధ డిస్కౌంట్లను అందిస్తుంది.

రిఫ్రెష్ చేయబడి హ్యుందాయ్ యాక్సెంట్‌పై రూ.25,000 నగదు డిస్కౌంట్, హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌పై మూడో ఏడాది కోసం అదనపు వారెంటీను, హ్యుందాయ్ సొనాటా, హ్యుందాయ్ ట్రాన్స్‌ఫామ్ మోడళ్లపై ఉచి బీమా ఆఫర్‌ను కూడా హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తుంది.

హ్యుందాయ్ బాటలోనే మరిన్ని ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా మందగించిన అమ్మకాలను పెంచుకునేందుకు వివిధ బంపర్ ఆఫర్లను ప్రకటించనున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 13, 2011, 18:02 [IST]
English summary
India's second largest carmaker Hyundai Motor India is offering a 5.99% interest rates on car loans for the Santro Xing and the i10. These two models are lucky charms for Hyundai. The loan amount for the 5.99% interest rate will be restricted to Rs 3 lakh with a tenure of just 3 years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+