ఇయాన్‌లో ఎల్‌పిజి వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్న హ్యుందాయ్

Hyundai Eon
భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తాజాగా భారత చిన్న కార్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టోకి పోటీగా విడుదల చేసిన "హ్యుందాయన్ ఇయాన్"లో ఓ ఎల్‌పిజి వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ2 సెగ్మెంట్లో హ్యుందాయ్ అందిస్తున్న మరో చిన్న కారు 'హ్యుందాయ్ ఐ10'లో కూడా ఓ ఎల్‌పిజి వేరియంట్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఓవైపు పెట్రోల్ ధరలు భగ్గుమంటుండం, మరోవైపు మారుతి సుజుకి ఆల్టో మోడల్‌కు మరింత గట్టి పోటీని ఇచ్చేందుకు హ్యుందాయ్ ఈ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెట్రోల్ వేరియంట్లో లభిస్తున్న హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారు అన్ని మార్కెట్ల నుండి అశేష ఆదరణ లభిస్తుంది. హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న శాంత్రో అమ్మకాలను సైతం హ్యుందాయ్ ఇయాన్ అధిగమిస్తోంది.

ఎల్‌పిజి ఇంధనంతో నడవనున్న ఇయాన్, ఐ10 మోడళ్లు ఇటు పెట్రోల్‌తో అటు ఎల్‌పిజితోనూ నడిచే విధంగా హ్యుందాయ్ వీటి ఇంజన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఐదేళ్లలో 15 మోడళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తానని చెప్పిన హ్యుందాయ్ కొత్త మోడళ్ల జాబితాలో ఈ రెండు వేరియంట్లు కూడా ఉండే అవకాశం ఉంది. ధర ప్రకారం చూస్తే పెట్రోల్ కన్నా ఎల్‌పిజి 30-40 శాతం తక్కువగా ఉంటుంది. సిటీ రోడ్లకు ఎల్‌పిజి కార్లు అన్ని విధాల చక్కగా సరిపోతాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 18, 2011, 16:31 [IST]
English summary
Hyundai Motors is planning to launch LPG powered Eon and i10 in the coming months according to some media reports. With an indefinite postponement of Hyundai's diesel engine plant in India, the Korean carmaker had to offer a cheaper fuel alternative to petrol for its small cars or it face the risk of dwindling sales even for its low priced cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+