అమెరికాలో 1,90,000 హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్‌ల రీకాల్

Hyundai Recall
అమెరికాలో రవాణ వ్యవస్థ ఎంత భద్రంగా ఉంటుదో చెప్పడానికి తాజాగా.. ఆ దేశంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు చేస్తున్న రీకాల్‌లే నిదర్శనాలు. వాహన నిర్మాణంలో ఏ చిన్న లోపం తలెత్తినా.. లేదా అలాంటి లోపాల కారణంగా ఏవైనా ప్రమాదాలు సంభవించినా.. అక్కడి ప్రభుత్వాధికారుల సదరు వాహన కంపెనీలను తక్షణ సంజాయిషీ కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హోండా మోటార్ కంపెనీ ఫ్యూయెల్ లీక్ సమస్య గురించి దాదాపు 22,000కు పైగా సివిక్ మోడల్ కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. దక్షిణ కొరియాకు అతిపెద్ద ఆటొమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ అమెరికాలో 1,90,000కు పైగా కార్లను రీకాల్ చేయనుంది.

అమెరికాలో విక్రయించిన దాదాపు 1,90,000కుపైగా ఎలంట్రా సెడాన్ కార్లను, అవి కూడా 2007, 2008, 2009 సంవత్సరాలలో తయారైన కార్లలో ఎయిర్ బ్యాగ్ సెన్సార్ సమస్య కారణంగా వీటిని రీకాల్ చయనున్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించడం జరిగింది. 2010లో అమెరికాలో ఎలంట్రా విక్రయాలు 28 శాతం వృద్ధి చెంది దాదాపు 1,32,000 కార్లు అమ్ముడయ్యాయి. ఇది అమెరికాలో హ్యుందాయ్ అందిస్తున్న సొనాటా సెడాన్ తర్వాత సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కారు కావడం విశేషం. వచ్చే నెలలో ఈ రీకాల్ ప్రారంభం కానుంది. డీలర్ సర్వీస్ కేంద్రాలలోనే ఈ సమస్యను సరిచేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, March 19, 2011, 12:43 [IST]
English summary
South Korean auto major Hyundai Corp recalled more than 190,000 Elantra sedans in the United States due to airbag issue. The recall affects Elantras for the model years 2007, 2008 and 2009.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+