విడుదలకు సిద్ధమైన హ్యుందాయ్ హెచ్800 చిన్న కారు!

హ్యుందాయ్‌కు విడిభాగాలు సరఫరా చేసే సప్లయర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ 800 సీసీ కారు అక్టోబర్ నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. రూ. 2.5 లక్షలు లేదా రూ. 3 లక్షలకు దిగువన హ్యుందాయ్ హెచ్800 కారును కంపెనీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక జరిగితే, భారత్‌లో హ్యుందాయ్ అందిస్తున్న అతి చౌవకైన కారుగా ఇది నిలువనుంది. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న చౌక కారు రూ. 3.2 లక్షలు (శాంత్రో)గా ఉంది.
దేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ అందించనున్న కొత్త హెచ్800 చిన్న కారు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న మారుతి సుజుకి ఆల్టోకు మరియు త్వరలో మారుతి సుజుకి నుంచి ఆల్టో ఫ్లాట్‌ఫామ్‌పై మార్కెట్లోకి రానున్న సరికొత్త 800 సీసీ కార్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది. సెప్టెంబర్‌లో హ్యుందాయ్ హెచ్800 కారు ఉత్పత్తిని చేపట్టనున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా స్పందిచాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








