హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న సెడాన్ వేరియంట్ "వెర్నా" కారులో మరో కొత్త వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్, దేశీయ మార్కెట్లో తమ వెర్నా కారు కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించగలదని ధీమా వ్యక్తం చేస్తుంది. క్లాస్, డిజైన్, క్వాలిటీ, టెక్నాలజీల కమిట్‌మెంట్‌లో తమ వినియోగదారులకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హెచ్ డబ్ల్యూ పార్క్ వెల్లడించారు.
కాగా.. కొత్త వెర్నా కారు 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో వీటి ప్రారంభ ధరలు రూ. 6.99 లక్షలు మరియు రూ. 10.75 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ వివరించింది. హ్యుందాయ్ 2006లో మొట్టమొదిటిసారిగా వెర్నా బ్రాండ్‌ను పరిచయం చేసింది.