సిటీ, వెంటోలను ఓవర్‌టేక్ చేసిన కొత్త ఫ్లూయిడిక్ వెర్నా

Fluidic Verna
హ్యుందాయ్ ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫ్లూయిడిక్ వెర్నా మోడల్ మార్కెట్లో శరవేగంగా దూసుకుపోతుంది. దేశీయ ద్వితీయ అగ్రగామిక కార్ల తయారీ సంస్థ అందిస్తున్న వెర్నా మోడల్‌కు సరికొత్త హంగులను అద్ది తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్కెట్లో విడుదలైన ఒక్క నెలకే వెర్నా ఫ్లూయిడిక్‌కు భారీ స్పందన లభించింది.

అంతేకాకుండా.. భారత మార్కెట్లో ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్నిఏర్పాటు చేసుకున్న హోండా సిటీను, ఇటీవల వచ్చిన జర్మనీ కారు ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఓవర్‌టేక్ చేస్తే, ఈ రెండు మోడళ్లను కూడా వెర్నా ఫ్లూయిడిరక్ ఓవర్ టేక్ చేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 10,303 కార్ల అమ్మకాలతో ప్రస్తుతం హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్ మిడ్-సైజ్ సెగ్మెంట్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది.

కాగా.. గతేడాది ఇదే సమయంలో పాత మోడల్ వెర్నా అమ్మకాలు 5,338 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ఇదే కాలానికి ఫోక్స్‌వ్యాగన్ వెంటో 7,726 కార్లను విక్రయించి. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అరవింద్ సక్సేనా మాట్లాడుతూ.. 'కేవలం దేశీయ మార్కెట్ కోసం మాత్రమే కొత్త వెర్నాను రూపొందించాం.

ఈ మోడల్‌కు మా వినియోగదారుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది, ఫలితంగా ఇప్పటి వరకూ ఈ మోడల్‌కు 24,000లకు పైగా బుకింగ్‌లు వచ్చాయ'ని తెలిపారు. దీంతో మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో దశాబ్ధానికి పైగా ప్రథమ స్థానంలో కొనసాగిన హోండా సిటీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. సిటీని ఓవర్‌టేక్ చేసి ప్రధమ స్థానంలోకి వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఇప్పుడు రెండో స్థానానికి దిగజారిపోయింది.

అయితే, హోండా సిటీ ఏలాగైనా తిరిగి తన ప్రధమ స్థానాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో హోండా సిటీ మోడల్‌ ధరలను భారీగా తగ్గించింది. గత జూన్ నెలలో కంపెనీ కేవలం 2,802 యూనిట్లను మాత్రమే విక్రయించింది. హోండా సిటీ సెడాన్ విక్రయాలను పెంచుకునేందుకు ఈ మోడల్‌పై రూ. 66,000 తగ్గింపును ఇవ్వడమే కాకుండా ఆకర్షనీమైన ఆఫర్లను కంపెనీ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 21, 2011, 16:19 [IST]
English summary
The recently launched all new Fluidic Verna from Hyundai appears to have made a huge impact in the Indian car market. With months after its launch, the Fluidic Verna has overtake the established mid-size sedans such as the Honda City and the Volkswagen Vento.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+