మారుతి సుజుకి మనేసర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి ఢోకా లేదు

Maruti Suzuki (Swift)
గత 27 రోజులుగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నామారుతి సుజుకి మనేసర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి ఢోకా లేదని శనివారం నాడు మారుతి సుజుకి కంపాక్ట్‌ కారు స్విఫ్ట్‌ 700 కార్లను ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. శనివారం నాడు ఒక్క రోజే గుర్‌గావ్‌లోని మనేసర్‌ప్లాంట్‌లో 700 స్విఫ్ట్‌ కార్లను ఉత్పత్తి చేసింది. మారుతి సుజుకి (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే జోరు కొనసాగితే నెలకు 17,500 స్విఫ్ట్‌ కార్లను ఉత్పత్తి చేయగలమని ప్రకటనలో పేర్కొంది. కొత్తగా కార్మికులను ఉద్యోగంలోకి తీసుకుంటామని దీంతో స్విఫ్ట్‌ కొత్త మోడళ్లను 17,500 యూనిట్ల స్థాయికి పెంచుతామని తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి ఎంఎస్‌ఐ సుమారు 800 మంది పైనే అనుభవజ్ఞులైన ఐటీఐ శిక్షణ పొందిన అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకుంది.

ఈ ప్లాంట్‌లో 2,500 మంది కార్మికులు, పనిచేస్తున్నారు. వారిలో 950 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు. ఎంఎస్‌ఐ యాజమాన్యం, కార్మికుల మధ్య ఆగస్టు 29వ తేదీనుంచి వివాదం కొనసాగుతోంది. కార్మికులు కావాలనే పనికి ఆటంకం కలిగిస్తూ, క్వాలిటీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని యాజమాన్యం వారిని పనిలోనికి రానివ్వలేదు. గుడ్‌ కాండెక్ట్‌ బాండ్‌పై సంతకం చేస్తేనే పనిలోనికి రానిస్తామని షరతు విధించింది. దీనికి కార్మికులు ససేమిరా అనడంతో వివాదం కొనసాగుతోంది. జూన్‌లో 13 రోజుల పాటు చేసిన సమ్మెకు యజామాన్యం ఇప్పుడు కక్ష తీర్చుకుంటుందని కార్మికులు అంటున్నారు.

వీరితో పాటు 90 మంది ఇంజినీర్లను మనేసర్‌ ప్లాంట్‌లో కొరకు తీసుకున్నామని ఎంఎస్‌ఐ తెలిపింది. ప్రస్తుతం మనేసర్‌ ప్లాంట్‌ మొత్తం 1,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త కార్మికులు ఉద్యోగంలో చేరడంతో యాజమాన్యం నూతన ఉత్సాహంతో కొత్త ఎంట్రీ లెవెల్‌ సీడాన్‌ డీజైర్‌, కొత్త స్విఫ్ట్‌ల ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది. కొత్త డీజైర్‌ కార్ల ట్రయిల్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. మనేసర్‌ ప్లాంట్‌లో సరాసరి 1,200 స్విఫ్ట్‌లు, ఎ-స్టార్‌, ఎస్‌ 4 ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్నాయి.

Most Read Articles

English summary
The Haryana Government-brokered negotiations between Maruti Suzuki India's (MSI's) management and agitating workers at its Manesar plant failed on Friday, prolonging the impasse that began on August 29.
Story first published: Sunday, September 25, 2011, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X