రెండు వేదికలలో ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2011

Delhi Auto Expo
ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2011 రెండు ప్రాంతాల్లో జరగనుంది. ఈ ప్రదర్శన ఏర్పాటు కానున్న ప్రగతి మైదాన్‌లో స్థలమంతా ఇప్పటికే ఆటో కంపెనీలు బుక్‌ చేసుకోవడం, మరిన్ని అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు తమకూ ప్రదర్శనలో స్థానం కల్పించాలని ఒత్తిడి చేస్తుండడంతో మరో ప్రాంతంలో కూడా ఎక్స్‌పోను నిర్వహించాలని భావిస్తున్నట్టు వాహన సంస్థల ప్రతినిధి విష్ణు మాధుర్‌ వెల్లడించారు.

ఆటో ఎక్స్‌పో 2011లో పాల్గొనేందుకు స్థలం కోసం ఇలా అంతర్జాతీ సంస్థలు కూడా భారీగా పోటీ పడుతుండటం చూస్తుంటే.. ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆటో కంపెనీలకు భారత మార్కెట్ ఎంత ప్రాధాన్యత కలిగిన మార్కెటో అర్థమవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ప్రగతి మైదాన్‌లో 10 సార్లు ఇలాంటి ఆటో ఎక్స్‌పోలు నిర్వహించినప్పటికీ, ఎన్నడూ ఇంత భారీ స్పందన లభించలేదని ఒక్క వారంలోనే ఈ ప్రదర్శనకు కేటాయించిన స్థలాలన్నీ అమ్ముడైపోయాయని ఆయన చెప్పారు.

మొత్తం 55 వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వివిధ ఆటోమొబైల్ కంపెనీలు రిజర్వ్ చేసుకున్నాయని, ఇంకా 33 నుంచి 35 వేల చదరపు మీటర్లకు డిమాండ్‌ వుందని విష్ణు పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి నెలలో జరగబోయే ఈ ఆటో ప్రదర్శనకు దాదాపు 20 లక్షల మంది ప్రజలు హాజరు కావచ్చని, అలాగే 35 కొత్త వాహనాలు కూడా ఆవిష్కరణ జరిగే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. కాగా.. ఈ ప్రదర్శనకు రెండో వేదికను నోయిడాలోని ఎక్స్‌పో మార్ట్‌ మైదానాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, April 29, 2011, 12:21 [IST]
English summary
Within the capital region, Auto Expo 2012 may have a second venue as the entire space at Pragati Maidan has been sold and there is a long queue of prospective participants outside. Vishnu Mathur who heads the country's auto industry body said that they are contemplating a second location to accommodate the entire auto industry in an integrated manner.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+