గోవాలో ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరి వద్ద వాహనం: సర్వే

Goa
గోవా అంటే మనకు టక్కున గుర్తొచ్చేది సముద్రతీరాలు, ఆహ్లాదాన్ని బీచ్‌లు, రిసార్ట్‌లు. కానీ ఇకపై గోవా అంటే మనకు గుర్తొచ్చేది వాహనాల గోల మాత్రమే. అదెలా అనుకుంటున్నారా.. భారతదేశంలోనే అతి చిన్నరాష్ట్రమైన గోవా వాహన వినియోగంలో ఇప్పుడు ఆసియా, అమెరికాలోని కొన్ని దేశాలను సైతం అధిగమిస్తోంది. గోవాలో ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరి వద్ద వాహనం ఉందంటేనే.. ఈ ప్రాంతంలో వాహన వినియోగం ఎంత విపరీతంగా పెరిగిందో ఇట్టే అర్థమైపోతుంది. 2010-11 ఆర్థిక సర్వే ప్రకారం.. గోవా రాష్ట్రంలో నవంబర్ 30, 2010 నాటికి రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 7,65,588కి పెరిగింది. అంటే సగటు ప్రతి ఏటా ఇక్కడ 50,000కు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నట్లు ఆ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇరాక్ దేశంలో కూడా ప్రతి 100 మందిలో సగటున 50 మంది వద్ద వాహనాలు ఉండగా.. జోర్డాన్‌లో 47/100, బోల్వియాలో 46/100, పెరూలో 41/100, ఫిలిప్పీన్స్‌లో 31/100 చొప్పున వాహనాలు ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. ఇకపోతే భారతదేశంలో సగటున ప్రతి 100 మందిలో 12 మందికి వాహనాలు ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. కాగా.. గోవాలో టూవీలర్ వినియోగదారులే ఎక్కువగా రిజిస్టర్ అయినట్లు ఆ సర్వేలో తేలింది. 2001 జనాభ లెక్కల ప్రకారం.. గోవా జనాభ 13.47 లక్షలుగా ఉంది, 2011లో ఈ సంఖ్య 17 లక్షలకు పెరగవచ్చునని అంచనా. దీన్నిబట్టి చూస్తే రానున్న కాలంలో రోడ్లపై మనుషుల కన్నా వాహనాలే ఎక్కువగా దర్శనమిచ్చేలా ఉన్నాయన్నమాట.

More from DriveSpark

Article Published On: Thursday, March 17, 2011, 15:19 [IST]
English summary
Every other person owns a vehicle in Goa and around 50,000 new vehicles are purchased in the state annually, according to records provided by the transport department. As on November 30, 2010, there were 7.65 lakh vehicles registered in the state which has a population of 14 lakh people and there is one vehicle for every two persons in the state.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+