2012 చివరి నాటికి 100 కార్లను విక్రయిస్తాం: ఆస్టన్ మార్టిన్

కంపెనీ అందిస్తున్న వివిధ మోడళ్లపై అవగాహన కల్పించేందుకు బ్రిటన్‌కు చెందిన ఈ సూపర్ ప్రిమీయం లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన "ర్యాపిడ్"తో పాటు "డిబిఎస్" మరియు "వాంటేజ్" కార్లను ప్రదర్శనకు ఉంచింది. ఈ సందర్భంగా ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారు అయిన 'పెర్ఫామెన్స్ కార్స్' (ఇన్ఫినిటీ కార్స్‌లో ఓ భాగం) సంస్థ డైరెక్టర్ లలిత్ చౌదరి మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 30 కార్లను, అలాగే వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం (2011 మరియు 2012 సంవత్సరాల మొత్త విక్రయాలను కలిపి) 100 కార్లను విక్రయించాలని భావిస్తున్నామని తెలిపారు.
భారత్‌లో మొత్తం 10 మొడళ్లను ఆస్టన్ మార్టిన్ అందిస్తుంది. ఇవి పూర్తిగా బ్రిటన్‌లో తయారై, దిగుమతి చేసుకున్న కారుగా లభిస్తాయి. దేశీయ మార్కెట్లో వీటి ధరలు రూ. 1.35 కోట్ల నుంచి రూ. 20 వరకూ ఉన్నాయి. భారత్‌లో సిగ్నెంట్ మోడల్ మినహా బేసిక్ మోడల్ అయిన వీ వాంటేజ్ నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 (రూ. 20 కోట్లు) మోడల్ వరకూ లభిస్తున్నాయి. ఇక్కడి వినియోగదారుల కోసం 6 నుంచి 7 వన్-77 కార్లను అందుబాటులో ఉండేలా కంపెనీ చర్యలు తీసుకోనుంది. ఫెరారీ, పోర్షే, బెంజ్, బెంట్లీ, మాసేరటి వంటి లగ్జరీ కార్లకు ధీటుగా ఆస్టన్ మార్టిన్ గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








