2020 నాటికి ప్రపంచపు 3వ అతిపెద్ద తేలిక వాహనాల మార్కెట్‌గా భారత్

Automobile Industry
చైనా మరియు అమెరికా దేశాల తర్వతా 2020 నాటికి భారతదేశం ప్రపంచపు మూడవ అతిపెద్ద తేలిక వాహనాల (లైట్ వెహికల్) మార్కెట్‌గా (ప్యాసింజర్ కార్లు మరియు తేలికపాటి వాణిజ్య వాహనాలను కలుపుకొని) అవతరించనుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ 'జెడి పవర్ ఆసియా పసిఫిక్' పేర్కొంది. ఇదే సమయంలో భారత్ తన మౌలిక సదుపాయాలతో పాటుగా విడిభాగాల సరఫరాను మెరుగుపరచుకోగలదని జెడి పవర్ వెల్లడించింది.

జెడి పవర్ రూపొందించిన 'ఇండియన్ ఆటోమోటివ్ 2020: ది నెక్స్ట్ గెయింట్ ఫ్రమ్ ఆసియా' అనే నివేదికలో ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉన్న భారత్, 2020 నాటికి చైనా అమరికా దేశాల సరసన చేరుతుందని, ఆ సమయానికి దేశీయ మొత్తం విక్రయాలు 11.9 మిలియన్ల లైట్ వెహికల్స్‌గా ఉంటాయని వెల్లడించింది. 2010లో 2.7 మిలియన్ల లైట్ వెహికల్స్‌ అమ్ముడయ్యాయి. 2000 సంవత్సరంలో ఇవి కేవలం ఏడు లక్షలు మాత్రమే ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.

అలాగే 2020 నాటికి చైనా లైట్ వెహికల్ మార్కెట్ 35 మిలియన్లకు పెరుగుతుందని, ఇదే సమయంలో అమెరికా మార్కెట్ 17.4 మిలియన్లను తాకుతుందని జెడి పవర్ అంచనా వేసింది. భారత మార్కెట్‌లో భారీ అవకాశాలు ఉన్నాయని, కానీ ఈ వృద్ధి రేటును చేరుకోవడానికి దేశ మౌలికరంగం కీలక సవాల్‌గా మారుతుందని జెడి పవర్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోహిత్ అరోరా తెలిపారు. దేశంలో విడిభాగాల సరఫరా మెరుగుపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

More from DriveSpark

Article Published On: Monday, June 13, 2011, 17:44 [IST]
English summary
India will become the third largest market in the world after China and the US for light vehicles, including passenger cars and light commercial vehicles (LCVs), by 2020, according to market research firm JD Power Asia Pacific.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+