ప్రపంచపు ఆరవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్..!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో (ఏప్రిల్ 2010 - ఫిబ్రవరి 2011) భారత కార్ల ఉత్పత్తి సుమారు 26.78 లక్షలకు పైగా ఉంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) గత అంచనాల ప్రకారం.. భారత 2015 నాటికి ప్రపంచపు ఆరవ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఎదుగుతుందని పేర్కొంది. కానీ.. పరిశ్రమ కనబరుస్తున్న అనూహ్య వృద్ధి కారణంగా ఇది ఎస్ఐఏఎమ్ అంచనాల కంటే ముందుగానే, అంటే.. ప్రస్తుత సంవత్సరంలోనే సాధ్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
వివిధ ఆటోమొబైల్ కంపెనీలు కొత్తగా విడుదల చేస్తున్న కార్లకు కంపెనీలు, మార్కెట్ అంచనాలకు మించి ఆర్డర్లు వస్తుండటం, ఈ డిమాండును అందుకోవడానికి ఆటో కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం వంటి పలు అంశాల కారణంగా భారత్‌లో కార్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. దీంతో భారత్ కార్ల తయారీలో ప్రపంచ దేశాల సరసన చేరనుంది. ఈ ఏడాది భారత్‌లో మారుతి ఆర్3, హోండా బ్రయో, టొయోటా లివా, జనరల్ మోటార్స్ సెయిల్ వంటి పలు కొత్త కార్లు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications








