మిత్సుబిషి అభివృద్ధికి భారత్, బ్రెజిల్‌లు రెండు కీలక మార్కెట్లు

Mitsubishi Motors
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ తన సత్తాను చాటుతుండటంతో ప్రపంచ దేశాలు భారత మార్కెట్‌పై కన్నేశాయి. భారత భూభాగంపై అడుగు పెట్టడానికి పలు దేశాలు ఆసక్తి చూపుతుండగా.. మరికొన్ని దేశాలు ఇప్పటికే తమ కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేసి విక్రయాలను పెంచుకోవాలని చూస్తున్నాయి. భారత్, బ్రెజిల్ దేశాలలో హోండా, నిస్సాన్, టొయోటా వంటి విదేశీ కంపెనీలు తమ కొత్త కొత్త ఉత్పాదనలతో పటిష్టమైన మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.

జపాన్ ‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ మిత్సుబిషి కూడా ఆ కంపెనీలను ఆదర్శంగా తీసుకొని భారత్, బ్రెజిల్‌ దేశాలలో తమదైన ముద్ర వేసుకోవాలని భావిస్తుంది. దీనిలో భాగంగా మిత్సుబిషి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందుకు కోసం ఉత్పత్తిని ఔట్‌సోర్సింగ్ చేయడానికి ఫ్రాన్స్ ‌కు చెందిన ఓ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే పనిలో ఉంది. ఇంకా.. నిస్సాన్ ‌తో జాయింట్ వెంటర్‌గా ఏర్పడి తక్కువ ధర కలిగిన వాహనాల (చిన్న కార్ల)ను ఉత్పత్తి చేసే అంశంపై కూడా మిత్సుబిషి చర్చలు జరుపుతోంది.

అంతే కాకుండా.. అమెరికా, యూరప్ మార్కెట్ల కోసం ప్రత్యేకించి కొన్ని వాహనాలను మిత్సుబిషి రూపొందిస్తుంది. పంపిణీ ప్రక్రియ ద్వారా తమ ప్రపంచస్థాయి ఉత్పత్తిని 15 లక్షల యూనిట్లకు పెంచుకోవడమే మిత్సుబిషి ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మిత్సుబిషి 241.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించి ఎమ్ఎన్‌సి ఆటోమోటార్స్, బ్రసిల్ ఎస్ఏ (మిత్సుబిషి వాహనాల ఉత్పత్తిలో భాగంగా ఉన్న ఓ బ్రెజిల్ కంపెనీ)లలో 50 వాటాలను ఆక్రమించుకోనుంది. ఈ విస్తరణ ప్రణాళికతో కంపెనీ సంవత్సరానికి కనీసం ఒక లక్ష కార్లను తయారు చేయవచ్చని అంచనా వేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 19, 2011, 15:22 [IST]
English summary
The global success of auto sector has witnessed the contribution of India and made many overseas players to affirm their foot on these lands. Some of them are coming out with new launches to increase their sale volume in India. For Mitsubishi the move is to follow the wheel marks of Honda, Nissan and Toyota by establishing a strong market especially India and Brazil.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+