ఆటో రంగంలో అమెరికాను ఓవర్‌టేక్ చేయనున్న భారత్

India Cars
ఆటోమొబైల్ రంగానికి 2010 సంవత్సరం గోల్డెన్ ఇయర్‌గా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో చిన్నతరహా ఆటోమొబైల్ కంపెనీల నుంచి జనరల్ మోటార్స్ వంటి ఆటో దిగ్గజాల వరకూ దాదాపు అన్ని కంపెనీలు ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఆర్థిక మాంద్యపు మేఘాలను సైతం చీల్చుకుంటూ ఆటో రంగం తన జోరును కనబరిచింది. భారత ఆటో మార్కెట్ కూడా 30 శాతం వృద్ధి చెంది ఆర్థిక నిపుణుల అంచనాలను సైతం తలకిందులు చేసింది.

ఈ నేపథ్యంలో రానున్న 25 ఏళ్లలో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాను, తర్వాతి స్థానంలో ఉన్న చైనా దేశాలను భారత్ అధిగమించగలదని బూజ్ అండ్ ఆంప్ అనే విశ్లేషణ కంపెనీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 2020 నాటికి దేశీయ వార్షిక వాహన విక్రయాల సంఖ్య రెండింతల వృద్ధితో 50-60 లక్షలకు పెరగనవచ్చునని కంపెనీ తెలిపింది. ఈ దశాబ్దం మధ్య భాగంలో ఉత్పత్తిపై ఆటో హబ్‌ దృష్టిసారించడాన్నిబట్టి అంచనా వేస్తే.. అమెరికాను భారత్ అధిగమిస్తున్న విషయం అర్థమవుతుందని కంపెనీ పేర్కొంది. మరో దశాబ్ధంలో ఆమెరికా ఆటో విక్రయాల సంఖ్య తగ్గిపోవచ్చునని, అప్పటికి భారత్ 200 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి అమెరికాకు ధీటుగా నిలబడగలదని ఆ సర్వే అంచనా వేసింది.

More from DriveSpark

Article Published On: Friday, February 18, 2011, 15:33 [IST]
English summary
The highly competitive car market in global level is looking the US as the most potential while China is on the race on rapidity. But the assessment studied by Booz&amp Co, revealed that India cars may overtake both these countries in another 25 years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+