ప్రభుత్వానికి ఫాల్టీ వాహనాలను రీకాల్ చేసే అధికారం!

ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే.. ఇలాంటి ఓ వ్యవస్థనే మన దేశంలో కూడా ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. లోపపూరిత వాహనాలను తయారు చేసే కంపెనీల వాహనాలను రీకాల్ చేసే అధికారాన్ని కలిగి ఉండేలా ఓ ప్రత్యేకమైన విభాగాన్ని (స్పెషలైజ్డ్ బాడీ) ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు నేషనల్ ఆటోమోటివ్ బోర్డు (ఎన్ఏబి) అనే పేరును కూడా ప్రతిపాదించడం జరిగింది.
ఇటీవలి కాలంలో తయారీ లోపం కారణంగా ఇటు భారత్‌లోనే కాకుండా అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు వాహన తయారీదారులు తమ వాహనాలను రీకాల్ చేస్తుండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని భారీ పరిశ్రమల శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి మన దేశంలో రీకాల్ విధానం లేదు. లోపాలను గుర్తిస్తే కార్ల తయారీదారులే రీకాల్‌ను ప్రకటిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ ఎన్ఏబి ఏర్పాటయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








