ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆటో వృద్ధి 11-13%: ఎస్ఐఏఎమ్

గత మూడు నెలల క్రితం భారత ఆటోమొబైల్ రంగం 12 నుంచి 15 శాతం మేర వృద్ధి చెందగలదని ఎస్ఐఏఎమ్ అంచనా వేసింది. అయితే, ఏవి ఎలా ఉన్నప్పటికీ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 10-12 మేర పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయని, అమెరికా వంటి అగ్రరాజ్య మార్కెట్లను అధిగమించగలిగామని గోయెంకా చెప్పారు.
ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో మొదటి ఆరు నెలల్లో వివిధ దేశాల ప్యాసింజర్ కార్ మార్కెట్లలో అమ్మకాలు ఈ విధంగా ఉన్నాయి. మన దేశ ప్యాసింజర్ వాహన మార్కెట్ 18.20 శాతం పెరగి మొదటి స్థానంలో ఉండగా., ఇదే విభాగంలో 14.40 శాతం వృద్ధితో అమెరికా ద్వితీయ స్థానంలో ఉంది. ఇకపోతే జర్మనీ 14.30 శాతం వృద్ధిని, చైనా 11 శాతం వృద్ధిని, బ్రెజిల్ 8.30 శాతం మేర వృద్ధిని సాధించి తర్వాతి స్థానాలలో నిలిచాయి.


Click it and Unblock the Notifications








