ఆఫ్రికాలో చైనా కంపెనీలకు చెక్ పెట్టనున్న భారత బైక్ కంపెనీలు

ఆఫ్రికాలో ఏటా 2.5 మిలియన్ల బైక్‌లు అమ్ముడవుతాయి. ప్రస్తుతం ఈ మార్కెట్‌ను చైనా బైక్ తయారీదారులు డామినేట్ చేస్తున్నారు, అయితే సరసమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందించే భారతీయ కంపెనీల నుంచి చైనా బైక్ తయారీదారులు గట్టి పోటీ ఎదుర్కునే ఆస్కారం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఫ్రికా ప్రాంతాలలో భారతీయ బైక్ కంపెనీలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఈ మార్కెట్లలో వారు తమ ఎంట్రీ లెవల్ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా మరిన్ని అవకాశాలను పొందవచ్చునని పిడబ్ల్యూసి ఆటో ప్రాక్టీస్ లీడర్ అబ్దుల్ మజీద్ వెల్లడించారు.
ప్రస్తుతం ఎగుమతులపై దృష్టి సారించిన దేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (హీరో హోండా) ఆఫ్రికా ఖండంలో తమ ఎంట్రీ లెవల్ బైక్ సిడి-డాన్‌ను అత్యంత పోటీతత్వ ధరతో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆటోమొబైల్ పరిశ్రమ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీని తర్వాత ఇతర 100సిసి మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. గతంలో ప్రకచింనట్లుగానే, ఎగుమతులపా ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఒక క్రాస్-ఫంక్షనల్ టీమ్ (సిఎఫ్‌టి)ను ఏర్పాటు చేశామని హీరో గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








