భారత కార్ విక్రయాలు తగ్గుతాయిస కానీ ఫోక్స్‌వ్యాగన్‌వి తగ్గవు

VW Passat
గతేడాది(2010)లో 30 శాతం వృద్ధిని సాధించిన భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌(2011)లో 12-14 శాతానికే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ఇంధన రేట్లకుతోడు సూక్ష్మ-ఆర్థిక కారకాలు కూడా అనుకూలంగా లేవని, ప్రస్తుతం భారత్‌లోని ఆటోమొబైల్ తయారీదారులకు సరైన సమయం కాదని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డివిజన్ డైరెక్టర్ (బోర్డు సభ్యులు) నీరజ్ గార్గ్ వెల్లడించారు. అయితే, తమ కంపెనీ విక్రయాలు మాత్రం గతేడాతో పోలిస్తే 2011లో అధికంగా ఉన్నాయని తెలిపారు.

గడచిన సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో 32,500 కార్లను విక్రయించగా, ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే కంపెనీ విక్రయాలు 39,366 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే 2010లో భారత్‌ మార్కెట్లో ఏడాది పాటు సాధించిన వృద్ధిని 2011లో ఆరు నెలల్లోనే కంపెనీ సాధించగలిగింది. కాగా.. మిగిలిన ఆరు నెలల్లో తమ కంపెనీ ఇదే విధమైన వృద్ధిని సాధించగలదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. దీన్ని అంచనా వేయడం క్లిష్టతరమని, ప్రస్తుతం పరిశ్రమ నెమ్మిదించిందని తెలిపారు. పటిష్టమైన వినియోగదారులు కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఫలితంగా బుకింగ్‌లు తగ్గాయని ఆయన చెప్పారు.

అంతేకాకుండా.. కంపెనీ తన కొత్త మోడల్ జెట్టాను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే పస్సాట్‌ను విడదల చేశామని, మరికొద్ది నెలల్లో జెట్టాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అలాగే, పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ల నుంచి కొనుగోలుదారులు డీజిల్ ఇంజన్ వేరియంట్ మోడళ్ల వైపు మొగ్గుచూపుతుండటాన్ని ఫోక్స్‌వ్యాగన్ కళ్లజూసింది. గతేడాది మొత్తం ఫోక్స్‌వ్యాగన్ పోలో విక్రయాల్లో 62-63 శాతం కొనుగోలుదారులు పెట్రోల్ మోడళ్లను ఆశ్రయిస్తే, ఈ ఏడాది 50 శాతం మాత్రమే పెట్రోల్ మోడళ్లను కొనుగోలు చేశారని, వెంటో మోడల్ పరిస్థితి కూడా ఇలానే ఉందని గార్గ్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2011, 18:24 [IST]
English summary
Neeraj Garg, the Director (Member of Board) of Volkswagen Passenger Cars Division of Volkswagen Group Sales India Private Limited said the current picture for car makers was gloomy but added sales at his company would actually increase from last year's sales. Volkswagen had sold 32,500 cars in India in 2010 and has already sold 39,366 vehicles in the first six months of this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+