స్వీడన్‌లో వోల్వో ఆసియా ఫ్యూయెల్‌వాచ్ పోటీ నెగ్గిన భారతీయుడు

Volvo Truck
స్వీడన్‌లో ఓ భారతీయ ట్రిప్పర్ డ్రైవర్ తన సత్తా చాటాడు. భావి తరాలకు ఇంధనం ఆదా చేసే ప్రచారంలో భాగంగా.. వోల్వో చేపట్టిన "వోల్వో ఆసియా ఫ్యూయెల్‌వాచ్ కాంపిటీషన్"లో ముగ్గురు భారతీయుల తమ సత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో దేశ విదేశాలకు చెందిన ట్రక్ డ్రైవర్లు పాల్గొన్నారు. కాగా.. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోసుల వెంకట సురేష్ అత్యధిక ఫ్యూయెల్-ఎఫిషీయన్సీని కనబరిచి ఈ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచారు.

ఈ పోటీలో భాగంగా.. నిర్థిష్ట ఇంధనాకి సాధ్యమైనంత అధిక దూరం ప్రయాణించి ఇంధన సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. స్వీడన్‌లోని గోచెన్‌బర్గ్‌ సమీపంలోని ఓ రాతి క్వారీలో ఏప్రిల్ 14, 2011న ఈ పోటీ నిర్వహించారు. అసాధారణ పరిస్థితుల్లో సైతం డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శించి డ్రైవర్ ప్రతిభను మెరుగు పరచడంతో పాటు సమాజానికి ఓ మెసేజ్‌ను పంపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వోల్వో ట్రక్స్ నిర్వహించింది.

వోల్వో ట్రక్స్ కార్పోరేషన్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ లార్స్ మార్టెన్సన్ విజేతలకు ట్రోఫీని అందజేసి సత్కరించారు. మరో ఇద్దరు భారతీయులు రన్నరర్‌లుగా నిలిచారు. నాణ్యత, భద్రత మరియు పర్యావరణ పరిరక్షణలు వోల్వో ట్రక్‌లు కోట్ల విలువలతో సమానమని కంపెనీ పేర్కొంది. పర్యావరణంపై దుష్ప్రభావాన్ని తగ్గించడంతో అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇచ్చేలా తమ ట్రక్స్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2011, 15:31 [IST]
English summary
Swedish truck maker Volvo has a global presence and has been operating in India as well. With a production facility in the outskirts of angalore Volvo has been churning out top quality trucks and buses. The company is focused on reducing the fuel consumption of its vehicles and has invested heavily on research. As per its analysis an effective driver can help reduce fuel consumption by as much as 30%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+