మారుతి 800తో ఎగిరే కారును రూపొందించిన భారతీయుడు

ఈ ఎగిరే కారును సృష్టించేందుకు తనకు 16 సంవత్సరాల సమయం పట్టిందని 52 ఏళ్ల విశ్వనాథ్ డైలీ మెయిల్ పత్రికతో తెలిపారు. రన్‌వే అవసరం లేకుండా ఇది పైకెగరగలదని, ఇప్పటికే ప్రయోగాత్మకంగా కూడా దీనిని పరీక్షించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకూ విశ్వనాథ్ తన పరిశోధనలకు గానూ 40 పేటెంట్లను పొందారు. ఈ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ జనరేటర్ కారును గాల్లో ఎగిరేందుకు కావలసిన శక్తిని సమకూర్చుతుందని ఆయన తెలిపారు. బెంగుళూరు పేరుతో విశ్వనాథ్ సొంతంగా బెంగుళూరియన్ అనే ఓ కంపెనీను కూడా స్థాపించారు. ఇటీవల బెంగుళూరులో ఐదురోజుల పాటు జరిగిన ఏరో షో 2011లో విశ్వనాథ్ తన ఎగిరే కారును ప్రదర్శనకు ఉంచారు.


Click it and Unblock the Notifications








