ఒక్క రూపాయికే టొయోటా ఎతియోస్ ఇన్సూరెన్స్!

Toyota Etios
మేము ముందు నుంచి చెప్పుకొస్తున్నట్లుగానే, తగ్గుముఖం పడుతున్న కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు వివిధ ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వినూత్నమైన ప్రచారాలను మరియు ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా భారత మార్కెట్లో అందిస్తున్న ఎతియోస్ సెడాన్‌పై బెంగుళూరులో ఒక్క రూపాయికే బీమా (ఇన్సూరెన్స్) ఆఫర్‌ను ప్రకటించింది.

ఇదే కాకుండా ఆకర్షనీయమైన ఎక్సేంజ్ రేట్లను కూడా ఇవ్వనున్నట్లు టొయోటా పేర్కొంది. అయితే, ఈ బీమా ఆఫర్ కేవలం పెట్రోల్ వేరియంట్ ఎతియోస్‌పై మాత్రమేనని కంపెనీ ఓ మెలికను పెట్టింది. వాస్తవానికి టొయోటా ఈ నెల తొమ్మిదిన డీజిల్ వేరియంట్ ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీజిల్ వేరియంట్ ఎతియోస్ అమ్మకాలు పుంజుకోవచ్చనే ఆలోచనతో పెట్రోల్ వేరియంట్‌పై కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తుంది.

ఏదేమైనప్పటికీ పెట్రోల్ వేరియంట్ ఎతియోస్ సెడాన్ 1.5 లీటర్ డిఓహెచ్‌సి గ్యాసోలైన్ ఇంజన్‌తో 66lW (90PS)ల శక్తిని, 132 Nm @ 3000rpmల టార్క్‌ను విడుదల చేస్తుంది. 2 డిఐన్ డివిడి ఆడియో సిస్టమ్‌తో, స్టీరింగ్ వీల్స్‌పై ఆడియో కంట్రోల్స్‌ను కలిగి ఉండి, క్యాబిన్ స్పేస్ మరియు బూట్ స్పేస్‌ల విషయంలో బెస్ట్-ఇన్-క్లాస్ అనిపించుకుంటుంది. భారత మార్కెట్లో టొయోటా ఎతియోస్ సెడాన్ ధర రూ.4.98 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 14, 2011, 8:13 [IST]
English summary
Toyota Kirloskar Motor is offering Insurance for Toyota Etios at Rs 1 on petrol variant. Company dealers is also offering attractive exchange offers. Toyota Etios price starts from Rs 4.98 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+