ఆటమ్ కార్లను భారత్‌కు తీసుకువచ్చిన ఇంటర్‌గ్లోబ్

Atom Car
కనివిని ఎరుగని రీతిలో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగిన ఫార్ములా వన్ రేస్ ఇండియన్ గ్రాండ్ ప్రితో భారత్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించింది. ఫార్ములా వన్ రేస్ పట్ల భారతీయులు చూపిని అభిమానానికి యావత్ ప్రపంచం విస్తుపోయింది. దీంతో వివిధ రేస్ కార్ల కంపెనీలు కంపెనీలు భారత్‌కు వచ్చేందుకు క్యూ కడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవలే బ్రిటీష్‌కు చెందిన మోటార్‌స్పోర్ట్స్ బ్రాండ్ "కేటర్‌హామ్" త్వరలోనే తమ విస్తృత స్థాయి స్పోర్ట్స్, రేస్ కార్లను భారత్‌కు పరిచయం చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా.. బ్రిటీష్‌కు చెందిన మరో స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఏరియెల్ మోటార్స్ తమ ఆటమ్ రేంజ్ కార్లను భారత్‌కు పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. న్యూఢిల్లీకు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ "ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్" ఆటమ్ కార్లను భారత్‌కు తీసుకురానుంది.

దేశీయ విపణిలో వీటి ధరలు రూ.55 లక్షల నుండి ప్రారంభమై రూ.85 లక్షల వరకూ ఉండనున్నాయి. ఇంగ్లాడ్‌కు చెందిన ఏరియెల్ మోటార్ కంపెనీ యొక్క వి8 ఆటమ్ సిరీస్ కారు గతంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే బుగాటి వేరాన్ కారును టాప్‌గేర్ టెస్ట్ ట్రాక్‌పై 1.7 సెకండ్లలో అధిగమించి రికార్డు సృష్టించిందని ఇంటర్‌గ్లోబ్ తెలిపింది. గతంలో ఇంటర్‌గ్లోబ్ స్వీడన్‌కు చెందిన రూ.12.5 కోట్ల విలువ చేసే సూపర్ లగ్జరీ స్పోర్స్ట్ కార్ 'కొయినిగ్‌సెగ్' కూడా భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2011, 15:57 [IST]
English summary
After british motorsports brand Caterham Cars announces it Indian entry plans, now diversified business house InterGlobe Enterprises said it has launched British sportscar maker Ariel Motor's Atom range of cars in India, price starting from about Rs 55 lakh to Rs 85 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+