స్పేర్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్న కంపెనీలపై సీసీఐ నిఘా

అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలైన హోండా, హ్యుందాయ్, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు కార్ల విడిభాగాలను భారత మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ మార్కెట్‌లో అగ్రస్థానం పొందాలని భావిస్తున్న కాంపిటీషన్ వాచ్‌డాగ్ సీసీఐ ఆరోపించింది. ఈ మేరకు ఇటువంటి సంస్థలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులను అనుసరించి దర్యాప్తు చేపట్టాలని తమ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేన్)ను కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది.

మార్కెట్ పొజిషన్‌ను డామినేట్ చేసేందుకు సదరు కంపెనీలు తమ బ్రాండ్‌ల విడిభాగాలను నేరుగా అధీకృత డీలర్ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు మరో మార్గం లేక అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. సాధారణంగా దేశీయ కార్ల కంపెనీల విడిభాగాలు దాదాపు అన్ని రీటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి, కానీ ఇటువంటి విదేశీ కంపెనీ కార్ల విడిభాగాలు మాత్రం కంపెనీ అధీకృత డీలర్ల వద్ద మాత్రమే లభిస్తాయి. దీంతో సదరు డీలర్లు, తయారీదారులు విడిభాగాలను అధిక ధరలకు విక్రయించి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు.

కాగా.. ఈ ఆరోపణలపై 45 రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేసి ఓ నివేదికను అందజేయాలని డైరక్టర్ జనరల్‌ను సీసీఐ ఆదేశించింది. అంతర్జాతీయ తయారీదారుల నుంచి కార్లను కొనుగోలు చేసిన వినియోగదారుల స్పేర్ల కొరత కారణంగా సమస్యలను ఎదుర్కుంటున్నారని కాంపిటీషన్ చట్టం 2002లోని సెక్షన్ 4 క్రింద ఓ కేసును ఫైల్ చేశాడు. కాగా.. ఈ అంశంపై స్పందించేందుకు హ్యుందాయ్ మోటార్స్ నిరాకరించగా.. వోక్స్‌వ్యాగన్, హోండా కంపెనీలకు పంపిన ఈ-మెయిల్స్‌కు ఇంత వరకూ సమాధానం అందలేదని సీఐఐ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2011, 15:43 [IST]
English summary
International car makers, Honda, Hyundai and Volkswagen, have come under the scanner of the competition watchdog CCI for abusing their dominant market position by selling auto parts to customers at high prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+