థర్డ్‌-పార్టీ మోటార్‌ బీమా ప్రీమియంలు 70 శాతం పెంచిన ఐఆర్‌డీఏ

Automobile Loan
ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ రవాణా వాహనాల థర్డ్‌-పార్టీ మోటార్‌ బీమా ప్రీమియంలు 70 శాతం మేర పెంచుతున్నట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (ఐఆర్‌డీఏ) పేర్కొంది. ఏప్రిల్ 25 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయని, నాలుగేళ్ల ప్రీమియంలు పెంచుతున్నామని ఐఆర్‌డీఏ తెలిపింది.

ఇక నుంచి థర్డ్‌-పార్టీ మోటార్‌ బీమా ప్రీమియంలను ప్రతి ఏడాది సమీక్షించడం జరుగుతుంది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ తేదీ, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రీమియంలను సవరించడానికి ఐఆర్‌డీఏ ఒక సూత్రాన్ని కూడా తయారు చేసింది. ప్రస్తుతం ప్రీమియం రేట్లను ఐఆర్‌డీఏకు చెందిన టారిఫ్‌ సలహా కమిటీ నిర్ణయిస్తోంది.

1000 సీసీ కన్నా సామర్థ్యం మోటార్ కార్ల థర్డ్‌-పార్టీ వాహన బీమా ప్రీమియం ఇక నుంచి రూ. 740 చెల్లించాలి. (గతంలో ఇది రూ. 672గా ఉండేది). అలాగే.. 1000-1500 సీసీ కార్ల ప్రీమియం రూ. 800 నుంచ్ రూ. 880కు పెరిగింది. ఇకపోతే 1500 సీసీ మించిన కార్లకు ప్రిమీయం రుసుము రూ. 2,750కు పెరిగింది.

ద్విచక్ర వాహన విషయాలకు వస్తే.. 350 సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాల ప్రీమియం 10 శాతం పెరిగి రూ. 330కు చేరుకుంది. అలాగే.. 350 సీసీకు మించిన టూవీలర్ వాహనాల ప్రీమియం రుసుము రూ. 680ను వసూలు చేస్తారు.

ఇక వాణిజ్య వాహన యజమానుల విషయానికి వస్తే.. వాహన మొత్తం బరువు 7500 కేజీల వరకూ ఉంటే ప్రిమీయంలో రూ. 5000 నుంచి రూ. 8420 వరకు పెంపు ఉంటుంది.

ఐఆర్‌డీఏ తన ఎక్స్‌పోజర్‌ ముసాయిదాలో ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాల ప్రీమియంలో 10 శాతం, రవాణా వాహనాలపై 80 శాతం వరకు పెంపును సిఫారసు చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, April 18, 2011, 10:29 [IST]
English summary
The Insurance Regulatory and Development Authority (IRDA) has increased the third-party motor premium by up to 70%. This will be effect from April 25. For motor cars below 1000cc rates have gone up from Rs 672 to Rs 740, for cars between 1000 to 1500cc the rates are now Rs 880 as against Rs 800 earlier. In the case of two-wheelers upto 350cc the premium has risen 10% to Rs 330.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+