కారుతో పాటు దాన్ని నడిపేవారికి బీమా తప్పనిసరి!

అసలు విషయం ఏంటంటే.. వాహనంతో పాటు దాన్ని నడిపే వారికి ఇన్సూరెన్స్ (బీమా)ను తప్పనిసరి చేయాలని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) భావిస్తోంది. 'ఇతర దేశాల్లో వాహనాలు నడిపే వారికి తప్పనిసరిగా బీమా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగేది వాహనాలను నడిపే వారి వల్లే కాని వాహనాల వల్ల కాదు కదా.. కాబట్టి ఆ దిశగా మేము ఆలోచిస్తున్నామ'ని ఐఆర్‌డీఏ ఛైర్మన్ జె. హరినారాయణ్ ముంబైలో జరిగిన ఓ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు.
మోటార్ వాహనాల చట్టం మారాలని, ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వాహనాలకు మాత్రమే బీమా ఉంటే సరిపోతుందని దాన్ని నడిపేవారికి అవసరం లేదని, ఈ నిబంధనలు మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా నిబంధనలు ఇతర దేశాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలు అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications








