మహేంద్ర సింగ్ ధోనికి ఫెరారీ 599 జిటిఓ కారు బహుమతి..!?

MS Dhoni
క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకొని, 28 ఏళ్ల తర్వాత భారతదేశ ఘనతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన టీమిండియా ఆటగాళ్లకు కానుకల వర్షం కురుస్తోంది. ప్రపంచ కప్ 2011లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు సరికొత్త ఆడి లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆడి ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా.. భారత జట్టుకు సారధ్యం వహించిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకు ఓ సరికొత్త ఫెరారీ కారు లభించనున్నట్లు సమాచారం.

ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించిన ఫెరారీ ప్రత్యేకంగా తయారు చేసిన "ఫెరారీ 599 జిటిఓ" అనే సరికొత్త సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారు ధోనీకు కానుకగా ఇచ్చి భారత్‌లో తమ క్రేజ్‌ను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే ఫెరారీ ఈ మోడల్ కార్లను తయారుచేస్తుంది. ఈ కారును ప్రత్యేకించి ధోనీ కోసమే తయారు చేసినట్లు కూడా సమాచారం. అయితే ఈ విషయంపై స్పందించేందుకు మాత్రం కంపెనీ నిరాకరిస్తోంది.

దీనిపై ఇటలీకు చెందిన ఫెరారీ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఉన్న కారు ఫెరారీ 599 జిటిఓ అని మాత్రమే చెప్పారు. అంతకుమించి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మరి ఈ కారును ధోనీ కోసమే తయారు చేశారా అనే అంశాన్ని ప్రస్తావించగా.. కంపెనీ నియమ నిబంధనల ప్రకారం.. ఫెరారీ యజమానులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. సరే ఆ విషయం అలా ఉంచి.. ఈ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..!

కళ్లు చెందిరే అందం ఈ కారు సొంతం. అంతేకాకుండా.. ఈ కారు బోనెట్‌ (ఇంజన్‌ను కప్పి ఉంచే డోరు)పై మువ్వనెలతో కూడిన భారతదేశపు జాతీయ జెంఢా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఫెరారీ 599 జిటిఓ కారు వీ12 ఇంజన్‌తో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆఫ్షన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 335 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.35 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫెరారీ 599 బరువుతో పోలిస్తే 599 జిటిఓ బరువు 100 కేజీలు తక్కువగా ఉంటుంది. ఫెరారీ రూపొందించిన కార్లలో అత్యంత వేగంగా ప్రయాణించే కారు ఇదేనని సమాచారం.

గతంలో... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కూడా 2003లో ఫెరారీ ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది. 360 మోడెనా అనే స్పోర్ట్స్ కారులో భారత జట్టు ఫేవరెట్ క్రికెటర్ ప్రస్తుతం ముంబైలో షికార్లు చేస్తున్నారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం కూడా ఈ కారుపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. అయితే ఓ కోర్టులో ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో.. దిగుమతి సుంఖాన్ని కూడా ఫెరారీ తన బుజాలపై వేసుకోవాల్సి వచ్చింది. మరి అందువల్లనే ఈ ధోనీ ఫెరారీ కారు గురించి విషయాన్ని బయటకు రానివ్వడం లేదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 6, 2011, 17:49 [IST]
English summary
Team India captain Mahendra Singh Dhoni may be graced with a custom built Ferrari 599 GTO. The Italian luxury sports car maker Ferrari is all set to debut in Indian market with its all new sports car models like California, 458 Italian, 599GTB Fiorano and the latest FF, with prices starting from Rs 2.2 crore onwards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+