ఆగస్టు 19న ఫోర్స్ వన్ ఎస్‌యూవీ విడుదల..!?

గడచిన జూనె 23న కంపెనీ కొత్త ఎస్‌యూవీ పేరును మరియు లోగోను ఆవిష్కరించింది. అతి త్వరలోనే ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని కూడా కంపెనీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఆగస్టు నెలలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా తన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆగస్టు 17న విడుదల చేయాలని భావిస్తోంది. టాటా మోటార్స్ నుంచి కొత్త ఇండియా విస్టా, ఫోక్స్‌వ్యాగన్ కొత్త జెట్టా మరియు హోండా కొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్ వంటి మోడళ్లు ఆగస్టు నెలలో హల్ చల్ చేయనున్నాయి.


Click it and Unblock the Notifications








