అతి త్వరలో భారత్‌కు రానున్న రేంజ్ రోవర్ ఎవోక్!

వన్ఇండియా ఆటోమొబైల్ బెంగుళూరులోని ఓ జాగ్వార్ ల్యాండ్ రోవర్ డీలర్‌ను సంప్రదించగా, సదరు డీలర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీను పూర్తిగా బ్రిటన్‌లో ఉత్పత్తి భారత్‌కు సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్‌లో దిగుమతి చేసుకోనున్నారు. వాస్తవానికి ఎవోక్‌ను భారత్‌లోనే సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్ల రూపంలో విడిభాగాలుగా దిగుమతి చేసుకోని అసెంబ్లింగ్ చేయాలని టాటా మోటార్స్, ల్యాండ్ రోవర్ ప్రతిపాందించింది.
అయితే, ప్రస్తుతానికి ఈ ప్రణాళికలకు కంపెనీ ఫుల్‌స్టాప్ పెట్టింది. భారత్‌లో ఈ మోడల్ అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరిగితే అసెంబ్లింగ్ విషయాన్ని కంపెనీ పరిగణించే అవకాశం ఉంది. కాగా.. రేంజ్ రోవర్ ఎవోక్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇంకా ఇది పూర్తిగా మార్కెట్లోకి విడుదల కాక మునుపే జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు 20,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








