ఫోర్డ్, హోండా మోడళ్లలో కొనసాగుతున్న రీకాల్ పరంపర

కాగా.. ఈ తాజా రీకాల్‌లో ఫోర్డ్ రేంజర్ ట్రక్కులే అధికంగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 24,000 రేంజర్ ట్రక్కులు ఈ రీకాల్ కిందకు రానున్నాయి. ఇంధనం లీక్ కావడం లేదా ఎలక్ట్రిక్ సమస్యల వల్లే ఈ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని కంపెనీ ఓ ప్రాథమిక అంచనాకు వచ్చింది. మరో రీకాల్‌లో 9,000కు పైగా ట్రక్కుల (ఎఫ్-150, ఎఫ్-250, ఎఫ్-350, ఎఫ్-450, ఎఫ్-550, ఎడ్జ్, లింకోల్న్ ఎమ్‌కెఎక్స్)ను ఇదే కారణంతో రీకాల్ చేయనుంది.
ఇదిలా ఉండగా.. అమెరికాలో విక్రయించిన 36,656 సివిక్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు హోండా మోటార్ కంపెనీ ప్రకటించింది. హైబ్రిడ్ కంట్రోల్ సిస్టమ్‌లో ఓ పార్ట్‌ను రీప్లేస్ చేసేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వివరించింది. 2006-07 మధ్య కాలంలో తయారైన సివిక్ హైబ్రిడ్ మోడళ్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయి. ఇకపోతే గత బుధవారం అహ్మదాబాద్‌లో ఓ టాటా నానో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగి కాలిపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








