మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు ప్రత్యేక ధరతో..

ఈ నేపథ్యంలో రేవా అమ్మకాలను పెంచుకునేందుకు కేవలం రూ.2.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే ఈ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా అందిస్తుంది. ఇదివరకు స్టాండర్డ్ మోడల్ రేవా ఎలక్ట్రిక్ కారు ధర రూ.3.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉండేది. అయితే, ఈ ఆఫర్ కేవలం బెంగుళూరులో ఉండే కొనుగోలుదారులకు మాత్రమేనని, అది కూడా ఈ నెలాఖరు వరకూ మాత్రమే ఇది అమల్లో ఉంటుందని మహీంద్రా రేవా ప్రకటించింది.


Click it and Unblock the Notifications








