ఇండియా నుంచే విడిభాగాలను కొనుక్కుంటాం: జాగ్వార్ ల్యాండ్ రోవర్

గడచిన 2010లో ఈ రెండు ఐకానిక్ (జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్) బ్రిటీష్ బ్రాండ్‌లు 25 శాతం వృద్ధిని కనబరిచాయి. గతేడాదిలో జేఎల్ఆర్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,43,621 యూనిట్లను విక్రయించింది. పటిష్టమైన డిమాండ్, మెరుగుపడిన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ వృద్ధిని సాధించగలిగామని కంపెనీ తెలిపింది. కాగా.. మార్చి 31, 2011తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్‌లో 891 యూనిట్లను జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయించింది. రానున్న కాలంలో ఈ బ్రాండ్‌లకు దేశీయ మార్కెట్లో మరింత డిమాండు పెరిగే ఆస్కారం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








