జాగ్వార్ సీ-ఎక్స్ 16 కాన్సెప్ట్: లగ్జరీ కార్లకే రారాజు!

ఈ టూ-సీటర్ కాన్సెప్ట్ కారు జాగ్వార్‌కు ఓ కొత్త అధ్యాయంగా నిలువనుందని, ఇది అత్యత్తమ పెర్ఫామెన్స్‌తో పాటు మంచి స్టైల్‌ను కలిగి ఉంటుదందని జాగ్వార్ అధికారి ఒకరు వెల్లడించారు. అమర్చారు. ఈ కారులో 3 లీటర్ల సామర్థ్యం కలిగిన సూపర్‌ఛార్జ్‌డ్ వీ6 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 380 PS (280kW) శక్తిని మరియు 332 lb ft (450 Nm) టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఫార్ములా వన్ హైబ్రిడ్ బూస్ట్ సిస్టమ్ ద్వారా ప్రేరణ పొంది ఈ కారు స్టీరింగ్‌కు ఆన్-డిమాండ్ యాక్సిలరేషన్ కోసం ఓ ప్రత్యేక బటన్‌ను అమర్చారు. ఈ కారుకు ఎనిమిది గేర్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇంధనం ఖాలీ అయిన సందర్భంలో ఈ మోటార్ సాయంతో కారును నడపొచ్చు. లేదా పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిట్ మోటార్ రెండిటినీ ఏకకాలంలో ఉపయోగించి అధిక శక్తితో ప్రయాణించవచ్చు.
1.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఈ మోటార్ పనిచేస్తుంది. కారులో ప్రయాణిస్తుండగా బ్రేక్ వేసినప్పుడు ఆ శక్తి ద్వారా కూడా బ్యాటరీలు చార్జ్ అయ్యే విధంగా ఓ వ్యవస్థను రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారు పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి, టార్క్‌లకు అధనంగా 95 PS (70 kW) శక్తిని మరియు 173 lb ft (235 Nm) టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 4.4 సెకండ్లలోనే 0.62 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని గరిష్టంగా గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది.


Click it and Unblock the Notifications








