జపాన్ భీభత్సం: తాత్కాలికంగా ఉత్పత్తిని తగ్గించనున్న హోండా

హోండా మోటార్ కార్పోరేషన్, భారత్‌లోని సియోల్ గ్రూపుతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్లాంటులో కార్లను తయారు చేస్తుంది. వార్షికంగా ఒక లక్ష వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేశారు. జపాన్ భూపకంపం వల్ల తమ కంపెనీ ఉత్పత్తులపై పడే ప్రభావాలను ఇంకా అంచనా వేస్తూనే ఉన్నామని, కానీ మే నెలలో మాత్రం కంపెనీ అవుట్‌పుట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.
మార్చి 11, 2011న జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 9.0 మాగ్నిట్యూడ్ తీవ్రత కలిగిన భూకంపం సంభవించడంతో భారీ సునామీ ఏర్పడి ఆ దేశంలో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి భీభత్సం కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా విడిభాగాల కొరత కంపెనీలు వేధిస్తోంది. ప్రతినెలా 8,300 కార్లను ఉత్పత్తి చేసే హోండా ప్రస్తుతం దాదాపు 5,000 కార్లను మాత్రమే తయారు చేస్తుంది.


Click it and Unblock the Notifications








