కొట్టుకుపోయిన నిస్సాన్ కార్లు, హోండా ప్లాంట్ల మూసివేత..!

Auto Companies
జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్నే మిగిల్చింది. ఇటు ప్రాణ నష్టంతో పాటు అటు భారీ ఆస్తి నష్టాన్ని కూడా కలిగించింది. ఆటోమొబైల్ పరిశ్రమలకు పట్టుకొమ్మలా ఉండే జపాన్ ఇప్పడు నిటిలో కలిసిపోయి కష్టాల కడలని తలపిస్తోంది. ఆటోమొబైల్ ఉత్పత్తుల తయారీలో అగ్రగాములుగా ఉన్న హోండా మోటార్స్, నిస్సాన్ మోటార్స్, టొయోటా వంటి పలు ప్రముఖ కంపెనీలు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని కంపెనీలు ప్లాంట్లను మూసివేసి సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ప్రకృతి భీబత్సం కారణంగా 2,300 కొత్త వాహనాలకు డ్యామేజ్ వాటిల్లినట్లు జపాన్‌కు చెందిన రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రకటించింది. నాలుగు ఫ్యాక్టరీలు, రెండు కార్యాలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఉత్తరాది జపాన్‌లో ఉన్న డీలర్లతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని నిస్సాన్ తెలిపింది. కాగా.. సయామా, మౌకా, హమామత్సు, సుజుకా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హోండా మోటార్ కంపెనీ పేర్కొంది. ఇంకా తోషిబా వంటి పలు కంపెనీలు కూడా తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

జపాన్‌లో శుక్రవారం రోజున 8.8 తీవ్రత కలిగిన భూకంపం సంభవించడంతో అతి భీకర సునామీ సంభవించిన సంగతి తెలిసిందే. సుమద్రపు అలలు 13 అడుగుల మేర ఎగసిపడి జపాన్‌ను ముంచి వేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య, ఆస్తి నష్టాల వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 12, 2011, 18:16 [IST]
English summary
Japan's second-largest carmaker Nissan Motor Corporation said 2,300 new vehicles were damaged and four factories, two offices were also suffered minor damage by tsunami surges yesterday in the wake of an 8.9-magnitude earthquake, the strongest ever recorded in Japan. Honda Motor Co. said it will stop production at factories in Sayama, Mouka, Hamamatsu and Suzuki.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+