చెన్నైను గ్లోబల్ ఆటో హబ్‌గా మార్చడమే లక్ష్యం: జయ

"ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్‌ల తయారీలో తమిళనాడు నెంబర్ వన్. ఈ విషయంలో చెన్నైను మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం" అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం ఫోర్డ్, హ్యుందాయ్, రీనాల్ట్-నిస్సాన్, బిఎమ్‌డబ్ల్యూ వంటి వివిద విదేశీ కంపెనీల నుంచి అధిక సంఖ్యలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరిన్ని ఆటోమొబైల్ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు జయ సర్కారు సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








