అపోలో బాటలోనే జేకే..: టైర్ల ధరల పెంపుకు ప్రణాళికలు..!

JK Tyre
అపోలో టైర్స్ బాటలోనే.. ప్రముఖ టైర్ల ఉత్పత్తి సంస్థ జేకే టైర్స్ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధరలను కూడా ఎప్రిల్‌ 1 నుంచి పెంచాలని నిర్ణయించినట్లు జేకే టైర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతోందని జేకే టైర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ఏఎస్‌ మెహతా తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లోని ఇతర సంస్థల పెంపుదలను గమనించిన తరువాత తమ ధరలు నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

టైర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు 2009-2010లో కేవలం 18-20 శాతం మాత్రమే పెరిగితే, 2010-11లో దాదాపు 50 శాతానికి పెరిగాయని మెహతా చెప్పారు. ఇప్పటికే పెరిగిన ఖర్చుల కారణంగా టైర్ల తయారీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోందని, ఫలితంగా సదరు కంపెనీలు ఆర్థికంగా నష్టపోతున్నాయని చెప్పారు. పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా టైర్ల ధరలను పెంచకపోయినట్లయితే టైర్ల కంపెనీల మనుగడ ప్రశ్నర్థకంగా మారే అవకాశం ఉందని మెహతా అన్నారు. గత నెలలో కూడా జేకే టైర్స్‌ తన ధరలను 2 శాతం వరకు పెంచింది. కాగా.. ఏప్రిల్ 1 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 6 శాతం మేర పెంచుతున్నట్లు జేకే టైర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలపై జపాన్ సునామీ.. తీవ్ర ప్రభావాలను చూపుతున్న తరుణంలో దేశీయంగా లభ్యమయ్యే ముడి సరుకుల ధరలు కూడా చుక్కలనంటుతుండటంతో.. ఆటోమొబైల్ సంస్థలు ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ త్రైమాసికంలో పరిశీలిస్తామని ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న ధరలతో ఇటు సామాన్యులు.. అటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 1, 2011, 10:30 [IST]
English summary
Leading tyre manufactures JK Tyre & Industries Ltd said it is considering to hike product prices in April to offset rising raw material costs. The company's statement comes a day after Apollo Tyres announced that it would hike product prices by up to 6 per cent from April.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+